50 రూపాయలు పెట్టుబడి.. అతడిని కోటీశ్వరుడిని చేసిన డ్రీమ్ 11

Madhubani barber wins 1 crore in fantasy contest. డ్రీమ్ 11 యాప్.. ఇదొక ఫాంటసీ క్రికెట్ యాప్..! ఎంతో మంది ఇందులో డబ్బులు పెడుతూ తాము

By Medi Samrat  Published on  29 Sept 2021 11:35 AM IST
50 రూపాయలు పెట్టుబడి.. అతడిని కోటీశ్వరుడిని చేసిన డ్రీమ్ 11

డ్రీమ్ 11 యాప్.. ఇదొక ఫాంటసీ క్రికెట్ యాప్..! ఎంతో మంది ఇందులో డబ్బులు పెడుతూ తాము సెలెక్ట్ చేసిన ఆటగాళ్లు సరిగా ఆడారా లేదా పాయింట్లు ఎక్కువ సంపాదించి ఉంటే ప్రైజ్ మనీని సొంతం చేసుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు. డ్రీమ్ 11 యొక్క పోటీదారులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యొక్క లైవ్ మ్యాచ్‌లో 11 మంది ఆటగాళ్ల వర్చువల్ బృందాన్ని సృష్టించాలి. ఆ నిర్దిష్ట మ్యాచ్‌లో ఆటగాళ్లు సాధించిన పరుగులు, బౌండరీలు మరియు వికెట్లను బట్టి, వర్చువల్ జట్టు యజమాని పాయింట్లను పొందుతాడు. ఆ తర్వాత ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ యాప్ లో ఫ్రీ కాంటెస్ట్ నుండి.. కోట్ల రూపాయల కాంటెస్ట్ ల వరకూ ఉంటాయి.

తాజాగా ఓ వ్యక్తికి భారీగా అదృష్టం వరించింది. ఏకంగా అతడిని కోటీశ్వరుడిని చేసింది. విజేత అశోక్ ఠాకూర్ మధుబని జిల్లాలోని ఆంధ్రతర్హి బ్లాక్‌లోని నానౌర్ చౌక్‌లో సెలూన్ నిర్వహిస్తున్నాడు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన అశోక్ 'డ్రీమ్-11'లో బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అదృష్టం అతడి ఇంటి తలపు తట్టింది. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెలూన్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచీ ఆసక్తి ఉన్న అతడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 'డ్రీమ్-11'లో బెట్టింగ్ కాయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. విషయం తెలిసి అశోక్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. కేవలం 50 రూపాయలతో కోటి రూపాయల కాంటెస్ట్‌లో పాల్గొన్నాడు. ఐతే ఆ రోజు అనూహ్యంగా అతడే విజేతగా నిలిచాడు. కోటి రూపాయలు వచ్చినంతమాత్రాన వృత్తిని వదులుకోబోనని చెప్పుకొచ్చాడు.


Next Story