లోక్‌సభ ఎన్నికలు: మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల

లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. తొలి విడతలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

By అంజి  Published on  20 March 2024 4:14 AM GMT
Lok Sabha elections, nominations, polling, india

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

బుధవారం నాడు లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. తొలి విడతలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న లోక్‌సభ ఎన్నికల తొలి దశకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడత నామినేషన్‌ దాఖలుకు చివరి రోజు మార్చి 27. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈ నెల 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 19న పోలింగ్, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

తొలి దశలో తమిళనాడులోని 39, రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌, అస్సాం, మహారాష్ట్రల్లో 5 సీట్లు, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లోని 3 స్థానాల్లో, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలలో రెండు సీట్లు, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ మరియు నికోబార్ దీవులు, జమ్ము అండ్ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కొక్క సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలు.. సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా (ఎస్సీ), మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ -- మొదటి దశలో ఓటు వేయనున్నారు.

Next Story