గుడ్‌ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గించాయి.

By Medi Samrat
Published on : 1 May 2025 1:30 PM IST

గుడ్‌ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గించాయి. తాజా సవరణ ప్రకారం.. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 14.50 మేర ధర తగ్గింది. విమాన ఇంధనం ధరలను కూడా తగ్గించినట్లు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో కదలికలకు అనుగుణంగా చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర యథాతథంగా కొనసాగుతుందని కంపెనీలు స్పష్టం చేశాయి.

విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను కూడా తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధరపై 4.4 శాతం కోత విధించాయి. దీనివల్ల కిలోలీటర్‌కు రూ. 3,954 మేర ధర తగ్గింది. ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ. 85,486.80కి చేరింది.

Next Story