ఒక్కటైన ప్రేమజంట.. తాళిని కొడుకు చేతికి తాకించి..!

Lovers got married front their baby. ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమెను లోబర్చుకున్నాడు.

By అంజి  Published on  23 Oct 2021 5:53 AM
ఒక్కటైన ప్రేమజంట.. తాళిని కొడుకు చేతికి తాకించి..!

ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమెను లోబర్చుకున్నాడు. యువకుడు చేసిన పనికి యువతి గర్భం దాల్చింది. దీంతో ఆ యువకుడు మొఖం చాటేశాడు. తాజాగా ఆ యువతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో డెలివరీ తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో కన్న బిడ్డ సాక్షిగా పోలీసుల సమక్షంలో ఒక్కటైంది ఆ ప్రేమజంట. ఈ ఘటన కడలూరు జిల్లా విరుదాచలంలో జరిగింది. ముదనై గ్రామానికి చెందిన వేల్‌మురుగన్‌ (36), అదే ఏరియాకు చెందిన సత్య (27) గత నాలుగు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. దీంతో సత్య గర్భం దాల్చింది. ఆ తర్వాత సత్యను పెళ్లి చేసుకునేందుకు వేల్‌మురుగన్‌ నిరాకరించాడు. కాగా విరుదాచలం ప్రభుత్వాసుపత్రిలో సత్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇచ్చే క్రమంలో ఆస్పత్రి సిబ్బందికి సత్యకు జరిగిన మోసం తెలిసింది. దీంతో వారు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వేల్‌మురుగన్‌ అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం అతడు సత్యను పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో కొలజియం అమ్మన్‌ టెంపుల్‌లో కొడుకు సమక్షంలో సత్య, వేలుమురుగన్‌ పెళ్లి చేసుకున్నారు.

Next Story