భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు

మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు

By Medi Samrat  Published on  4 Nov 2024 2:34 PM GMT
భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు

మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ముడా భూకేటాయింపు కేసులో నవంబర్ 6న విచారించే నిమిత్తం సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు ​​జారీ చేశారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ముఖ్యమంత్రి భార్య పార్వతి బీఎంను అక్టోబర్ 25న ప్రశ్నించారు. బుధవారం ఉదయం హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త నాకు నోటీసు జారీ చేసిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. నవంబర్ 6వ తేదీన మైసూర్ లోకాయుక్తకు వెళతానని వెల్ల‌డించారు. మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు తదితరుల పేర్లు ఉన్నాయి.

Next Story