దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఏపీ బీహార్‌లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- నేటి ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ
- ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
- ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
- మే 13న పోలింగ్