మారటోరియంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..!

Loan Moratorium Cannot Be Extended, Says Supreme Court. తాజాగా మారటోరియం పొడిగింపు, మొత్తం వడ్డీని మాఫీ చేయడం లాంటి అంశాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది

By Medi Samrat  Published on  23 March 2021 8:27 AM GMT
Loan Moratorium Cannot Be Extended, Says Supreme Court

మారటోరియం గతేడాది లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున చర్చించిన అంశం ఇది.. లాక్ డౌన్ సమయంలో రుణాలపై ఇచ్చిన మారటోరియంను పొడిగించారు. తాజాగా మారటోరియం పొడిగింపు, మొత్తం వడ్డీని మాఫీ చేయడం లాంటి అంశాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వడ్డీని పూర్తిగా మాఫీ చేయలేమని సుప్రీం కోర్టు తెలిపింది. మాలాఫైడ్, ఏకపక్షంగా ఉంటే తప్ప కేంద్రం ఆర్థిక నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయలేమని తేల్చేసింది. ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని చెప్పుకొచ్చింది.

గ‌తేడాది భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) విధించిన మార‌టోరియం 2020 ఆగ‌స్టుతో ముగిసింది. రుణాల‌పై వ‌డ్డీ వ‌సూళ్ల మీద మార‌టోరియం పొడిగించ‌డానికి కేంద్ర ఆర్ధిక‌శాఖ‌, ఆర్బీఐ నిరాక‌రించాయి. చక్రవడ్డీ వసూలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, సుభాష్‌ రెడ్డి, ఆర్‌షా కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ తీర్పులను ఇచ్చింది. వడ్డీ మినహాయింపుపై వడ్డీని రూ .2 కోట్ల వరకు కేంద్రం పరిమితం చేసిందని.. ఈ ఆరు నెల‌ల కాలానికి రుణ గ్ర‌హీత‌లనుంచి చక్రవడ్డీ వ‌సూలు చేయొద్దని తెలిపింది. మార‌టోరియం కాలాన్ని పొడిగించ‌డం, మొత్తం వ‌డ్డీ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఖాతాదారుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు బ్యాంకులు వ‌డ్డీ చెల్లిస్తాయి, మరి అలాంట‌ప్పుడు బ్యాంకులు రుణాల‌పై పూర్తిగా వ‌డ్డీని మాఫీ చేయలేవని తెలిపింది.


Next Story
Share it