ఆయనే అప్పట్లో ముందుండి నడిపించారు.. ఆహ్వానం అందుకున్నారు..!

రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా అయోధ్య రామమందిర ఉద్యమానికి ఊపిరి పోసిన బీజేపీ కురువృద్ధుడు

By Medi Samrat  Published on  19 Dec 2023 3:03 PM GMT
ఆయనే అప్పట్లో ముందుండి నడిపించారు.. ఆహ్వానం అందుకున్నారు..!

రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా అయోధ్య రామమందిర ఉద్యమానికి ఊపిరి పోసిన బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి ఆహ్వానం అందింది. ఆయనతో పాటు ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి మురళీ మనోహర్ జోషికి కూడా అధికారిక ఆహ్వానం అందించింది విశ్వహిందూ పరిషత్. ఆరోగ్యం, వృద్ధాప్యం దృష్ట్యా ఎల్‌కే అద్వానీతో పాటు మనోహర్ జోషికి రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావొద్దని సోమవారం ఆలయ ట్రస్టు విజ్ఞప్తి చేసింది. తమ వినతిని వారిద్దరూ అంగీకరించారని కూడా ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయితే ఆ మరుసటి రోజే రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వాళ్లిద్దరు అధికారిక ఆహ్వానం ఇచ్చారు.

వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్‌కుమార్ మాట్లాడుతూ.. 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రామమందిర ఉద్యమ మార్గదర్శకుడు ఎల్‌కే అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషిని ఆహ్వానించామన్నారు. వారితో ఉద్యమం గురించి చర్చలు జరిపామన్నారు. జనవరి 15 నాటికి ఆలయానికి సంబంధించి సన్నాహకాలు పూర్తవుతాయని, జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ట పూజలు ప్రారంభమై జనవరి 22 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కొత్తగా నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Next Story