డిసెంబర్ లో మస్త్ బ్యాంకు హాలిడేస్

డిసెంబర్ 2024 కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సెలవులను విడుదల చేసింది.

By Medi Samrat  Published on  30 Nov 2024 10:45 AM IST
డిసెంబర్ లో మస్త్ బ్యాంకు హాలిడేస్

డిసెంబర్ 2024 కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సెలవులను విడుదల చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సెలవులు, వీకెండ్స్, క్రిస్మస్, ప్రాంతీయ సెలవులతో సహా మొత్తం 17 రోజులు డిసెంబర్ లో సెలవులు ఉండనున్నాయి. డిసెంబరు 2024లో వివిధ ప్రాంతీయ, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు మూసివేయనున్నారు. డిసెంబర్ 2024లో గోవా విమోచన దినం, క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ ఇలా వివిధ సందర్భాలలో వివిధ ప్రాంతాలలో బ్యాంకులను మూసివేయనున్నారు. సెలవులు రాష్ట్రాలవారీగా మారుతూ ఉంటాయి.

డిసెంబర్ 3: గోవాలో బ్యాంకులు మూసివేస్తారు (సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్)

డిసెంబర్ 12: మేఘాలయలో బ్యాంకులు మూసివేత (పా-టోగన్ నెంగ్మింజ సంగ్మా)

డిసెంబర్ 18: మేఘాలయలో బ్యాంకులు మూసివేత (యు సోసో థామ్ వర్ధంతి)

డిసెంబర్ 19: గోవాలో బ్యాంకులు మూసివేత (గోవా విమోచన దినోత్సవం)

డిసెంబర్ 24: మిజోరం, నాగాలాండ్, మేఘాలయ (క్రిస్మస్ ఈవ్) కారణంగా బ్యాంకులు మూసివేయనున్నారు.

డిసెంబర్ 25: దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత (క్రిస్మస్)

డిసెంబర్ 26: మిజోరం, నాగాలాండ్, మేఘాలయ (క్రిస్మస్ వేడుక)లలో బ్యాంకులు మూసివేత

డిసెంబర్ 27: నాగాలాండ్‌లో బ్యాంకులు మూసివేత (క్రిస్మస్ వేడుక)

డిసెంబర్ 30: మేఘాలయలో బ్యాంకులు మూసివేత (యు కియాంగ్ నంగ్‌బా)

డిసెంబరు 31: మిజోరం, సిక్కింలో బ్యాంకులు మూసివేత (నూతన సంవత్సర వేడుక/లాసాంగ్/నామ్‌సూంగ్)

UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా బ్యాంక్ సెలవుల్లో కూడా కస్టమర్‌లు వివిధ ఆర్థిక సేవలను యాక్సెస్ చేయవచ్చు. సేవల్లో చెక్ బుక్ అభ్యర్థనలు, బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌లు, డబ్బు బదిలీలు, ప్రయాణ బుకింగ్‌లు, ఖర్చుల ట్రాకింగ్, చెక్ క్యాన్సిలేషన్‌లు ఉంటాయి.

Next Story