ఉత్త‌ర భార‌త‌దేశంలో స్వ‌ల్ప ప్ర‌కంప‌న‌లు

బుధ‌వారం మ‌ధ్యాహ్నాం ఢిల్లీతో పాటు చుట్టు ప‌క్క‌ల‌ ప‌లు ప్రాంతాల్లో భూమి కంపించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2023 9:48 AM GMT
ఉత్త‌ర భార‌త‌దేశంలో స్వ‌ల్ప ప్ర‌కంప‌న‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు చుట్టు ప‌క్క‌ల‌ ప‌లు ప్రాంతాల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నాం భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.4 గా న‌మోద‌న‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ(ఎన్‌సీఎస్‌) తెలిపింది.

ఢిల్లీ, ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్త‌రాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్వ‌ల్పంగా భూమి కంపించింది. ఉత్త‌రాఖండ్ ఫితోరాగ‌ఢ్‌లో ప‌దికిలోమీట‌ర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా.. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఈ ఉద‌యం నేపాల్ దేశంలో భూకంపం సంభ‌వించింది. దాని ప్ర‌భావం ఉత్త‌ర భార‌త దేశంలో చూపించిన‌ట్లు అర్థంఅవుతోంది.

కాగా.. గత కొన్ని నెలలుగా నేపాల్‌లో తరచూ భూకంపాలు వస్తున్నాయి. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. గతేడాది నవంబర్‌లో దేశం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది,

Next Story