పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉంటున్న పాకిస్థానీలను ఈ నెల 27వ తేదీ నాటికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ ఏప్రిల్ 27తో రద్దు అవుతాయని, మెడికల్ వీసాలపై ఉన్నవారికి మాత్రం 29 వరకు అవకాశం ఇచ్చింది.
పాక్ జాతీయురాలు సీమా హైదర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారనే వార్తలపై ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఆ దేశానికి పంపొద్దని కోరింది. భారత్‌లోనే ఉండేందుకు అనుమతించాలంటూ ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేసింది. ఒకప్పుడు తాను పాకిస్థాన్ పౌరురాలు అయినప్పటికీ, ఇప్పుడు భారత్ కోడలినని దయచేసి తనను పాకిస్థాన్‌కు పంపొద్దని ఆమె కోరింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకున్నప్పుడే హిందూమతాన్ని స్వీకరించినట్లు తెలిపింది. సీమా భారత పౌరుడిని పెళ్లాడి, ఓ కూతురుకు జన్మనిచ్చింది.