అక్టోబర్ మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ కానుక..!

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద కానుక ఇవ్వబోతోంది.

By Medi Samrat
Published on : 6 Sept 2025 8:21 PM IST

అక్టోబర్ మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ కానుక..!

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద కానుక ఇవ్వబోతోంది. పండుగ సీజన్‌లో డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) మరియు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) 3% పెంపుతో 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. దీపావళికి ముందు అంటే అక్టోబర్ మొదటి వారంలో కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించ‌నుంది. 8వ వేతన సంఘం కంటే ముందు 7వ వేతన సంఘం కింద ఇది చివరి డీఏ పెంపు కానుంది. మోదీ ప్రభుత్వం 3 శాతం పెంచితే ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుంది. ఈ పెరిగిన డీఏ జూలై 2025 నుంచి వర్తిస్తుంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఉద్యోగులు, పెన్షనర్లు కూడా మూడు నెలల బకాయిలను పొందుతారు. అక్టోబరు నెల జీతాలతో పాటు దీన్ని కూడా చెల్లించాలని భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతోంది. జనవరి-జూన్ కాలానికి హోలీకి ముందు ఒకసారి, జూలై-డిసెంబర్ కాలానికి దీపావళికి ముందు రెండవసారి. గత సంవత్సరం, కేంద్ర ప్రభుత్వం పండుగకు రెండు వారాల ముందు అక్టోబర్ 16, 2024 న డీఏపెంపును ప్రకటించింది. ఈసారి దీపావళి అక్టోబరు 20-21 తేదీల్లో వస్తుంది. ఈ సారి అక్టోబర్ మొదటి వారంలో కేంద్రం డీఏ పెంపు ప్రకటించ‌నుంది.

డీఏ పెంపు వల్ల ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 50,000 అనుకుందాం, ఆపై పాత DA రేటు 55% ప్రకారం, భత్యం రూ. 27,500. కొత్త డీఏ 58%తో రూ.29,000కు పెరగనుంది. అంటే ఇప్పుడు ఉద్యోగులకు ప్రతి నెలా రూ.1,500 అదనంగా లభిస్తుంది. అంటే అతని జీతం రూ.1500 పెరుగుతుంది.

Next Story