హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక చెట్టు శిథిలాలతో పాటు వారిపై కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. ఈ సంఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక గురుద్వారా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డు అంచున కూర్చున్న వ్యక్తులు శిథిలాలతో పాటు ఒక పెద్ద చెట్టు కూలిపోవడంతో వారు నలిగిపోయారు. గాయపడిన వారిని చికిత్స కోసం జారి ఆసుపత్రిలో చేర్చారు.
కాగా, గాలిదుమారం వల్ల కొండచరియలు విరుగడంతో పెద్ద చెట్టు కూలింది. అక్కడున్న ఫుడ్ స్టాల్, కొన్ని వాహనాలపై అది పడింది. దీంతో ఒక వ్యాపారి, కారు డ్రైవర్, ముగ్గురు మహిళలతో సహా నలుగురు పర్యాటకులు మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఈ సంఘటన జరిగింది. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.