కుంభమేళాలో చనిపోయిన వారి శవాలను నదిలోకి పారేశారు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ సందర్భంగా వందలాది మంది స్నానాలు చేయడంతో గంగాజలం కలుషితమైందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  3 Feb 2025 8:16 PM IST
కుంభమేళాలో చనిపోయిన వారి శవాలను నదిలోకి పారేశారు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ సందర్భంగా వందలాది మంది స్నానాలు చేయడంతో గంగాజలం కలుషితమైందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను కూడా నదిలో పారవేయడంతో అత్యంత కలుషితమైందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన మహా కుంభ్‌లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వాదనలను రాజ్యసభ ఎంపీ బచ్చన్ తోసిపుచ్చారు. తొక్కిసలాటలో జరిగిన మరణాలపై ప్రభుత్వం వాస్తవ లెక్కలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేఖరులతో జయా బచ్చన్ మాట్లాడుతూ "ప్రస్తుతం అత్యంత కలుషితమైన నీరు ఎక్కడ ఉంది? అది కుంభ్‌లో ఉంది. దానిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలు నదిలో విసిరేశారు. దీని వల్ల నీరు కలుషితమైందని, ఈ నీటినే అక్కడి ప్రజలు వినియోగిస్తున్నారు. దీనిపై ఎవరూ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు." అని జయా బచ్చన్ తెలిపారు.

Next Story