మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి వాంఖడేపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వాఖండే రూ.70 వేల విలవ చేసే చొక్కా, రూ.లక్ష విలువైన ట్రౌజర్, లక్షల విలువ చేతి గడియారం ధరిస్తున్నాడని మంత్రి నవాబ్ మాలిక్ వ్యాఖ్యలు చేశారు. అయితే అవన్నీ పుకార్లు మాత్రమేనంటూ సమీర్ వాంఖడే కొట్టిపారేశారు. ఇదే విషయంపై సమీర్ భార్య క్రాంతి రేడ్కర్ మంత్రి నవాబ్ మాలిక్‌కు దీటుగా బదులిచ్చారు.
తాము తినే ఆహారం గురించి రేపోద్దున ఎవరూ వ్యాఖ్యలు చేయకుండా ఆధారాలతో సహా ట్వీట్ చేస్తున్నానన్నారు. తమ మధ్యాహ్న భోజన ఖర్చును వెల్లడించారు. తాము మధ్యాహ్న భోజనంలో దాల్ మఖ్నీ, జీరా రైస్ తిన్నామని చెప్పారు. ఇక జీరా రైస్ ఇంట్లో చేసిందేనని, దాల్ మఖ్నీ మాత్రం బయటి నుంచి ఆర్డర్ ద్వారా తెప్పించుకున్నామని, దాని ధర రూ.190 అని చెప్పారు. రేపొద్దున ఎవరైనా ఒక గవర్నమెంట్ అధికారికి సాధ్యంకానీ రీతిలో మేం తిండికి ఖర్చు చేస్తున్నాం అనొచ్చని, అందకు ఆధారాలతో సహా వెల్లడిస్తున్నానని క్రాంతి రేడ్కర్ ట్విటర్‌లో మంత్రి నవాబ్ మాలిక్‌కు బదులిచ్చారు.