'కూ' సీఈవోకు అరుదైన గుర్తింపు
Koo CEO among 100 most influential people in tech. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ 'కూ' సహ-వ్యవస్థాపకుడు, CEO అయిన అప్రమేయ రాధాకృష్ణ అంతర్జాతీయ
By Medi Samrat Published on 14 May 2022 12:27 PM GMTమైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ 'కూ' సహ-వ్యవస్థాపకుడు, CEO అయిన అప్రమేయ రాధాకృష్ణ అంతర్జాతీయ లాభాపేక్షలేని జర్నలిజం సంస్థ రెస్ట్ ఆఫ్ వరల్డ్ (RoW) ద్వారా టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్‌లలో గుర్తింపు పొందారు. అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ… రెస్ట్ ఆఫ్ వరల్డ్ 100: గ్లోబల్ టెక్ చేంజ్ మేకర్స్ లో గుర్తింపు పొందడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచంలోని అత్యంత గొప్ప పారిశ్రామికవేత్తలు, దార్శనికులు వారి వారి ప్రత్యేకతల ద్వారా లక్షలాది మంది జీవితాలను తీర్చిదిద్దుతున్న వారు కూడా ఉండడం తనకు మరింత ఆనందాన్ని కలుగజేస్తోందని తెలిపారు. రెస్ట్ ఆఫ్ వరల్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థచే గుర్తింపు పొందడం నిజంగా తమకు దక్కిన గౌరవమన్నారు రాధాకృష్ణ.
తాము భాష ఆధారిత మైక్రో-బ్లాగింగ్ ను కనుగొన్నామని, ఉన్నతమైన, లీనమయ్యే వివిధ భాషా అనుభవాన్ని అందించే పరిష్కారాన్ని రూపొందించామన్నారు. ప్రపంచంలోని 80శాతం మంది ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడతారు.. కాబట్టి స్థానిక భాషల్లో ఇలాంటి వాటి అవసరం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా అవసరమని అన్నారు. తమ పరిష్కారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించదగినదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లకు సంబంధించిందన్నారు. భారతదేశంలో నిర్మించిన తమ ప్రొడక్ట్ ను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడంపై తాము దృష్టి సారించామని చెప్పారు. RoW100: Global Tech's Changemakersలో 'కల్చర్ అండ్ సోషల్ మీడియా' కేటగిరీలో భారతదేశానికి చెందిన ఏకైక వ్యవస్థాపకుడుగా అప్రమేయ రాధాకృష్ణ నిలిచారు.
యూజర్ల సంఖ్యాపరంగా ఏడాది వ్యవధిలో దేశీయంగా ట్విటర్‌ను అధిగమించగలమని అప్రమేయ రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆయన తెలిపారు. గత 12 నెలల్లో 3 కోట్ల పైచిలుకు డౌన్‌లోడ్‌లు, నమోదయ్యాయని, యూజర్ల సంఖ్య 10 రెట్లు వృద్ధి చెందిందని రాధాకృష్ణ వివరించారు. 2022 ఆఖరు నాటికి ఈ సంఖ్య 10 కోట్లు దాటగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 మార్చిలో ప్రారంభమైన కూ ప్రస్తుతం దేశీయంగా ఇంగ్లిష్, తెలుగు, హిందీ సహా 10 భాషల్లో అందుబాటులో ఉంది. విదేశాల్లో విస్తరణలో అడుగులు వేస్తున్నామని రాధాకృష్ణ చెప్పారు.