కోల్‌కతా కేసులో వైద్యుల ఆందోళన నేపథ్యంలో మమత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు మమతా బెనర్జీ ప్రభుత్వం తలొగ్గింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ పదవి నుంచి వినీత్ కుమార్ గోయల్‌ను ప్రభుత్వం తొలగించింది. అతని స్థానంలో మనోజ్ కుమార్ వర్మ కోల్‌కతా పోలీస్ కొత్త కమిషనర్‌గా నియమితులయ్యారు. వినీత్ గోయల్ బదిలీ మీద STF ADG గా నియమించబడ్డారు.
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. సోమవారం జూనియర్ డాక్టర్లతో సమావేశం అనంతరం కోల్‌కతా పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ (నార్త్), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌లను తొలగిస్తున్నట్లు సీఎం మమత ప్రకటించారు.