కోవిడ్-19 వైరస్‌తో మరణించిన కోల్‌కతా నివాసి.. శుక్రవారం అంటువ్యాధికి సంబంధించిన వైద్య పరిశోధన కోసం తన శరీరాన్ని దానం చేశారు. కోవిడ్-పాజిటివ్ అయిన ఆ వ్యక్తి తన మరణానికి ముందు మెడికల్ పరిశోధన కోసం తన శరీరాన్ని దానం చేయాలనుకున్నాడు. ఒక వేళ తాను చనిపోతే.. తన బాడీని మెడికల్ రీసెర్చ్ తీసుకోవాలని డాక్టర్లకు చెప్పాడు. మరణించిన దాత నిర్మల్ దాస్‌గా గుర్తించారు. అతను క్యాన్సర్‌తో కూడా బాధపడుతున్నాడు. దాస్ నగరంలోని న్యూ టౌన్ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం 3,805 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. 89 ఏళ్ల నిర్మల్ దాస్ మృతదేహాన్ని శనివారం ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగానికి దానం చేశారు. తాజా కేసుల చేరికతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19,86,667కి పెరిగిందని ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కోల్‌కతాలో అత్యధికంగా 481 కొత్త కేసులు నమోదయ్యాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో 438 తాజా కేసులు నమోదయ్యాయి. తాజాగా 34 మరణాలతో, మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 20,515కి చేరుకుంది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తొమ్మిది మంది, కోల్‌కతాలో ఎనిమిది మంది కోవిడ్-19తో మరణించారని బులెటిన్ తెలిపింది.