చిట్టచివరి విద్యార్థిని తరలించే వరకూ ఈ మిషన్ ఆగదు

Kishan reddy About Indian Students Who are stuck in Ukraine. ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయ విద్యార్ధుల విష‌య‌మై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో..

By Medi Samrat
Published on : 26 Feb 2022 7:04 PM IST

చిట్టచివరి విద్యార్థిని తరలించే వరకూ ఈ మిషన్ ఆగదు

ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయ విద్యార్ధుల విష‌య‌మై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో.. ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడాన‌ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. భారతీయ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని వారు భరోసానివ్వడం జరిగిందని ఆయ‌న తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతదేశానికి చెందిన విద్యార్థులను తిరిగి మన దేశానికి తీసుకురావటానికి భారత ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందని ఆయ‌న అన్నారు.

నిరంతరం సరిహద్దు దేశాల అధికారులతో.. భారత రాయబార కార్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉందని కిష‌న్ రెడ్డి తెలిపారు. సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలను పంపించి ఎటువంటి విమాన ఖర్చులు లేకుండా వారిని క్షేమంగా వారి స్వస్థలాలకు చేరవేయడం జరుగుతోందని ఆయ‌న తెలిపారు. ఇప్పటికే 219 మంది భారతీయులతో కూడిన విమానం రొమేనియా నుండి బయలుదేరిందని.. చిట్టచివరి విద్యార్థిని తరలించే వరకూ నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్ ఆగదని కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.


Next Story