కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ.. 'ప్రైవేట్ వీడియో' లీక్ చేస్తానంటూ..
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ అధికార బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాల మధ్య ఆయన మేనేజర్‌కు
By అంజి Published on 5 April 2023 12:00 PM ISTకిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ.. 'ప్రైవేట్ వీడియో' లీక్ చేస్తానంటూ..
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ అధికార బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాల మధ్య ఆయన మేనేజర్‌కు బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిచ్చా సుదీప్ మేనేజర్ జాక్ మంజుకి గుర్తు తెలియని వ్యక్తి నుండి లేఖ వచ్చింది. నటుడి “ప్రైవేట్ వీడియో”ని సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించాడు. కిచ్చా సుదీప్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుట్టెనహళ్లి పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 504, 506, 120 (బి) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి అప్పగించాలని కొందరు సీనియర్ అధికారులు కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
కాగా, మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కన్నడ సూపర్ స్టార్ బుధవారం బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సుదీప్ పార్టీలో చేరడానికి ఇష్టపడకపోయినా, బిజెపికి ప్రచారం చేయాలని పార్టీ అభ్యర్థించిందని సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఇతర పార్టీ నాయకులు ఇప్పటికే సుదీప్‌తో సంభాషణలు జరుపుతున్నారు. ఫిబ్రవరిలో, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) చీఫ్ డికె శివ కుమార్, కిచ్చా సుదీప్‌ను అతని నివాసంలో కలిశారు. మే 13న కర్ణాటక అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది.