బాధ్యతలు స్వీకరించిన ఖుష్భూ.. కంగ్రాట్స్ చెప్పిన చిరు

Khushbu sworn in as a member of the National Commission for Women. ఖుష్బూసుందర్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నామినేట్ చేసింది

By Medi Samrat
Published on : 28 Feb 2023 5:01 PM IST

బాధ్యతలు స్వీకరించిన ఖుష్భూ.. కంగ్రాట్స్ చెప్పిన చిరు

సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూసుందర్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నటి ఖుష్భూ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఖుష్భూ ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ ‘మా నాయకుడు ప్రధాని మోదీ, ఎన్ సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖశర్మ ఆశీస్సులతో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించాను. జీవితంలోని అన్ని రంగాలలో మా దేవీలు(ఆడవారు) రక్షించబడాలని.. మీ అందరి ప్రార్థనలు, మద్దతును కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఖుష్భూ సుందర్‌ తోపాటు మమతా కుమారి, టెలీనా కంగ్ డోబ్‌లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

ఖుష్భూపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్భూకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ‘‘చాలా సంతోషంగా ఉంది. మీరు కచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మీరు మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ.. సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మీ వల్ల మహిళల గొంతుక మరింత శక్తిమంతంగా మారుతుంది” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.




Next Story