ఖలిస్థాన్ కు మద్దతుగా ఢిల్లీలో గ్రాఫిటీలు, నినాదాలు

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీలు, నినాదాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 May 2024 4:01 PM IST
Khalistan, grafity,  delhi, india ,

ఖలిస్థాన్ కు మద్దతుగా ఢిల్లీలో గ్రాఫిటీలు, నినాదాలు 

ఢిల్లీలోని కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్లలోని కొన్ని స్తంభాలపై భారతదేశం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీలు, నినాదాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. గోడ మీద రాసిన రాతలు, నినాదాలను తొలగించాలని సంబంధిత అధికారులకు తెలియజేశామని.. దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. “మేము ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసాము. నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ఆ ప్రాంతంలోనూ, మెట్రో స్టేషన్లలోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నాయి” అని సదరు అధికారి తెలిపారు.

గత కొన్ని నెలలుగా ఖలిస్థాన్ మద్దతుదారులు దేశ రాజధాని ఢిల్లీలో కుట్రలకు తెరలేపారు. ఇంతకు ముందు కూడా పలు ప్రాంతాలలో ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు గ్రాఫిటీతో వేశారు. కొందరికి డబ్బులు ఇచ్చి విదేశీ శక్తులు ఈ పనులు చేయిస్తున్నాయని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు కూడా!!

Next Story