అయోధ్యలో కె.ఎఫ్.సి. లాంటివి పెట్టొచ్చట.. కానీ.!

అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సి) అయోధ్యలో తమ ఔట్‌లెట్లను తెరవవచ్చని, అయితే సంబంధిత జోన్‌లో శాకాహార వస్తువులను మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని

By Medi Samrat  Published on  7 Feb 2024 5:29 PM IST
అయోధ్యలో కె.ఎఫ్.సి. లాంటివి పెట్టొచ్చట.. కానీ.!

అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సి) అయోధ్యలో తమ ఔట్‌లెట్లను తెరవవచ్చని, అయితే సంబంధిత జోన్‌లో శాకాహార వస్తువులను మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ తెలిపారు. చికెన్ ఐటెమ్‌లకు ప్రసిద్ధి చెందిన KFC, తమ మాంసాహార ఉత్పత్తులను నియంత్రిత జోన్ బయట కావాలంటే అమ్ముకోవచ్చని వివరించారు. అయోధ్యలో మాంసాహారం, మద్యంపై నిషేధం అమలులో ఉంది.

అయోధ్య రామాలయ ప్రాంతం చుట్టూ 15 కిలోమీటర్ల ప్రాంతం అయిన పంచ్ కోసి మార్గ్‌లో మద్యం లేదా మాంసాహార వస్తువుల అమ్మకాలను అధికారులు ఇప్పటికే నిషేధించారు. ఆ జోన్ బయట కావాలనుకుంటే అమ్మకాలు జరుపుకోవచ్చు. "అయోధ్యలో KFCతో సహా అన్ని బ్రాండ్‌లు తమ అవుట్‌లెట్‌లను తెరుచుకోవచ్చు.. అందుకు మీకు స్వాగతం పలుకుతున్నాం. అయోధ్య ప్రాంతంలో మాంసాహారం, మద్యం అందించడం అమ్మడంపై నిషేధం ఉంది. అలాంటి ప్రాంతంలో తమ అవుట్‌లెట్‌లను తెరిస్తే మాత్రం శాఖాహారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అయోధ్యలోని మిగిలిన ప్రాంతంలో ఎలాంటి పరిమితి లేదు" అని జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ వివరించారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కూడా ఇదే విధమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. KFC వంటి సంస్థలు హరిద్వార్-రూర్కీ హైవేపై ఉన్నాయి. జనవరి 22న 'ప్రాణ్ ప్రతిష్ఠ' లేదా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో సందర్శకుల రద్దీ కనిపిస్తూ ఉంది. భక్తులకు సేవలందించేందుకు ఆలయానికి సమీపంలో అనేక రెస్టారెంట్లు వచ్చాయి. త్వరలో మరిన్ని రాబోతున్నాయి.

Next Story