ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చోటు చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 22 Jan 2026 7:45 AM IST

ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చోటు చేసుకుంది. దీపక్ ఆత్మహత్యకు కారణమైందన్న ఆరోపణలపై షిమ్జితా ముస్తఫా(35)ను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ మరణానికి ఆమె చర్యలే కారణమని పేర్కొంటూ కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం దీపక్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అతను తనను ఉద్దేశ్యపూర్వకంగా తాకాడని ఆరోపిస్తూ షిమ్జితా ముస్తఫా వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడం, సోషల్ మీడియాలో అవమానానికి గురవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన దీపక్, కోజికోడ్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దీపక్ ఆత్మహత్య అనంతరం షిమ్జితా ఆ వీడియోను తొలగించింది. తనను తాను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్టు చేసిన ఆమె, దానిని కూడా కొద్దిసేపటికి ప్రైవేట్‌లో పెట్టింది. అయితే పాపులారిటీని సంపాదించుకోవడం కోసం ఆమె ఈ పని చేసిందంటూ పలువురు ఆరోపించారు. దీంతో పోలీసులు తాజాగా ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. దీపక్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిన కమిషన్, వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డీసీపీకి సూచించింది.

Next Story