భారత్‌లో తొలి మంకీఫాక్స్ మరణం
Kerala man who returned from UAE died of monkeypox. యూఏఈ నుండి తిరిగి వచ్చిన 22 ఏళ్ల కేరళ వ్యక్తి మంకీఫాక్స్‌తో మరణించాడని
By Medi Samrat Published on 1 Aug 2022 3:53 PM ISTయూఏఈ నుండి తిరిగి వచ్చిన 22 ఏళ్ల కేరళ వ్యక్తి మంకీఫాక్స్‌తో మరణించాడని నివేదికలు ధృవీకరించాయి. ఇది భారతదేశంలో మొట్టమొదటి మంకీఫాక్స్ సంబంధిత మరణం. మృతుడి శాంపిల్స్‌ను పూణెలోని లాబోరేటరీలో పరీక్ష కోసం పంపగా.. ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. భారత ప్రభుత్వం దేశంలో మంకీపాక్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది, దీనికి డాక్టర్ వీకే పాల్, యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ నేతృత్వంలో ఇతర సభ్యులు ఉన్నారు.
శనివారం త్రిసూర్‌లో మరణించిన 22 ఏళ్ల వ్యక్తికి యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి రాకముందే మంకీపాక్స్ పాజిటివ్ గా తేలిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి స్వాబ్ ఫలితాలు వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారిస్తుంది అని మంత్రి తెలిపారు.
మృతుడి బంధువులు యువకుడు మరణించిన తర్వాత UAE నుండి వచ్చిన వైద్య నివేదికను వెల్లడించారని మంత్రి చెప్పారు. అతను జూలై 22 న భారతదేశానికి తిరిగి వచ్చాడు. తీవ్ర జ్వరం రావడంతో ఐదు రోజుల తరువాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడని పేర్కొన్నారు. "అతను విమానాశ్రయం నుండి ఎలా బయటకు వచ్చాడు.. అతని ఆరోగ్య వివరాలను ఎలా దాచి ఉంచాడు.. అనే విషయమై మేము ఆరా తీస్తాము. "మేము మృతుడి వివరణాత్మక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసాము. ఇప్పటికే చాలా మందిని క్వారంటైన్ చేయబడ్డారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం త్రిసూర్‌లో ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
మంకీఫాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదు. ఆ మరణం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చేరడంలో ఎందుకు ఆలస్యం జరిగిందో కూడా మేము పరిశీలిస్తామని మంత్రి చెప్పారు, అతను కొన్ని ఇతర వ్యాధులతో కూడా బాధపడుతున్నాడని వైద్యులు ఆమెకు చెప్పారు. గుర్తించబడినవి అవే కేసులు కాదు.. కానీ మంకీఫాక్స్ వేగంగా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ వేగంగా ఉన్నందున.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె చెప్పారు.