లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యేకు ఊర‌ట‌

లైంగిక వేధింపుల కేసులో సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామకూటథిల్‌కు ఊరట లభించింది.

By -  Medi Samrat
Published on : 6 Dec 2025 4:39 PM IST

లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యేకు ఊర‌ట‌

లైంగిక వేధింపుల కేసులో సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామకూటథిల్‌కు ఊరట లభించింది. రాహుల్‌ను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను కేరళ హైకోర్టు ఆమోదించింది. ఈ కేసు డిసెంబర్ 15న విచారణకు రానుంది. అప్పటి వరకు పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేయవ‌ద్ద‌ని ఆదేశించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్‌కూటతిల్‌పై అత్యాచారం సహా బలవంతపు అబార్షన్‌ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపై కేరళ హైకోర్టులో కేసు నమోదైంది.

కేరళ హైకోర్టులో జస్టిస్ కె బాబు తదుపరి విచారణను డిసెంబరు 15న వాయిదా వేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన పిటిషనర్‌ను అరెస్టు చేయలేమని, డిసెంబర్ 15 వరకు కేసు పెండింగ్‌లో ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్‌కూటథిల్‌ తరఫున న్యాయవాది ఎస్‌ రాజీవ్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే రాహుల్‌పై మరో అత్యాచారం కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ రాహుల్‌ మమ్‌కూటథిల్‌పై మరో అత్యాచారం కేసు పెట్టింది.

తిరువనంతపురంలోని దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. అంత‌కుముందు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించింది. అత్యాచారం, బలవంతంగా అబార్షన్ చేయించిన‌ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి రాహుల్ పరారీలో ఉన్నాడు.

కేరళ హైకోర్టులో తన తరఫు వాదనను వినిపించిన రాహుల్.. తనకు, మహిళకు మధ్య పరస్పర అంగీకారంతోనే సంబంధం ఏర్పడిందని అన్నారు. ఓ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆ మహిళ ఎమ్మెల్యేపై తప్పుడు కేసు పెట్టింది. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పని, తాను పూర్తిగా నిర్దోషినని రాహుల్ అంటున్నారు.

Next Story