ఆ స్టేట్‌లో ఇక బ్యాక్ బెంచర్లే ఉండరు..!

కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్‌బెంచర్లే ఉండరు. ఎందుకంటే కేరళ రాష్ట్రం సాంప్రదాయ వరుసల వారీగా సీటింగ్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat
Published on : 5 Aug 2025 5:03 PM IST

ఆ స్టేట్‌లో ఇక బ్యాక్ బెంచర్లే ఉండరు..!

కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్‌బెంచర్లే ఉండరు. ఎందుకంటే కేరళ రాష్ట్రం సాంప్రదాయ వరుసల వారీగా సీటింగ్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. పాఠశాల తరగతి గదుల నుండి 'బ్యాక్‌బెంచర్లు' అనే భావనను ప్రభుత్వం తొలగించాలని కోరుకుంటున్నట్లు విద్యా మంత్రి వి. శివన్‌కుట్టి తెలిపారు.

ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మన విద్యా వ్యవస్థకు అనువైన ఉత్తమ సీటింగ్ నమూనాను కనుగొనడానికి విద్యా శాఖ నిపుణుల ప్యానెల్‌ను నియమించాలని అనుకుంటూ ఉందని ఆయన అన్నారు. బ్యాక్‌బెంచర్ల భావనను తొలగించడానికి అనేక దేశాలు వేర్వేరు ప్రణాళికలను అనుసరిస్తున్నాయని మంత్రి అన్నారు. పిల్లలకు మెరుగైన భవిష్యత్తును నిర్ధారించడంలో అందరి మద్దతును కోరారు. మలయాళ చిత్రం "స్థానార్థి శ్రీకుట్టన్" సినిమా ద్వారా పంచుకున్న ఆలోచన ఆధారంగా, బ్యాక్‌బెంచర్ల భావనను తొలగించడం కొంతకాలంగా కేరళలో చర్చనీయాంశంగా ఉంది. ఈ చిత్రం నుండి ప్రేరణ పొంది ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఇప్పటికే U- ఆకారపు సీటింగ్ విధానాన్ని అమలు చేశాయి.

Next Story