కేరళ నుండి బెంగళూరుకు వచ్చిన జంట.. ప్లాన్ చేసి ముంచేశారు..!

కేరళకు చెందిన టామీ, షైనీ దంపతులు గత 25 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నారు.

By Medi Samrat
Published on : 8 July 2025 3:45 PM IST

కేరళ నుండి బెంగళూరుకు వచ్చిన జంట.. ప్లాన్ చేసి ముంచేశారు..!

కేరళకు చెందిన టామీ, షైనీ దంపతులు గత 25 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నారు. వీరు 'ఏ&ఏ చిట్స్ అండ్ ఫైనాన్స్' పేరుతో ఒక చిట్ ఫండ్ సంస్థను ప్రారంభించారు. తమ వద్ద పెట్టుబడి పెడితే 15 నుంచి 20 శాతం వరకు అధిక రాబడి ఇస్తామని ప్రజలను నమ్మించారు. నమ్మకం తెచ్చుకోవడం కోసం కొన్నాళ్లపాటు రాబడిని చెల్లించారు. దీంతో మరింత మంది పెట్టుబడులు పెట్టారు. కోట్లాది రూపాయలు తీసుకున్న తర్వాత చెల్లింపులు ఆపేశారు. బాధితులు సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి.

సుమారు 300 మంది బాధితులు రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ దంపతులు పరారయ్యే ముందు తమ చర, స్థిరాస్తులను అమ్ముకున్నట్లు తేలింది. పోలీసులు, టామీ, షైనీ దంపతుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story