Video : రూ.1100 లకు మీ మనస్సాక్షిని అమ్ముకోకండి

ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat
Published on : 24 Jan 2025 6:14 PM IST

Video : రూ.1100 లకు మీ మనస్సాక్షిని అమ్ముకోకండి

ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 'ఢిల్లీలో ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల భిన్న‌మైన‌వి అన్నారు.. ఎన్నికలకు ఒకటిన్నర నెలల ముందు డబ్బు, బూట్లు, బెడ్‌షీట్లు, చీరలు, రేషన్, బంగారు గొలుసుల బహిరంగంగా పంపిణీ చేయ‌డం ప్రారంభమైందని అన్నారు. ఎవరికీ ఎలాంటి భయం లేదని.. ఎన్నికల కమీషన్ వారిని అడ్డుకోవడం లేదు.. ఇదంతా పోలీసుల రక్షణలో జరుగుతోందని ఆరోపించారు. ఇది మన దేశానికి చాలా ప్రమాదకరమ‌ని.. ఈ సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి రావడం లేదు.. దీన్ని కొంతమంది అవినీతి నాయకులు పంపిణీ చేస్తున్నారని మండిప‌డ్డారు.

పంచేందుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. ఓట్ల కొనుగోలుకు వినియోగిస్తున్న డబ్బు దేశాన్ని లూటీ చేసి సంపాదించిన అవినీతి సొమ్ము అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారు పంచుతున్న డబ్బు తీసుకుని.. మీ ద‌గ్గ‌ర‌ ఉంచండి.. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ ఓటును అమ్ముకోకండి.. వాళ్లు రూ.1100 ఇస్తే, ఉంచుకోండి.. కానీ మీ మనస్సాక్షిని అమ్ముకోకండి.. మీరు ఎవరినైనా ఇష్టపడవచ్చు.. కానీ మీ ఓట్లను కొనడానికి ప్రయత్నిస్తున్న వారిని కాదు.. వారు దేశానికి శత్రువులు.. ఇలాంటి వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Next Story