BRS Bhavan: ఢిల్లీలో బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ప్రారంభించిన కేసీఆర్

బీఆర్ఎస్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది.

By అంజి  Published on  4 May 2023 9:30 AM GMT
KCR , BRS Bhawan, Delhi

BRS Bhavan: ఢిల్లీలో బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ప్రారంభించిన కేసీఆర్

బీఆర్ఎస్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ భవన్‌ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మ‌ధ్యాహ్నం 1:05 గంట‌ల‌కు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. రిబ్బన్‌ కట్‌ చేసి భవనంలోకి ప్రవేశించారు. పూజలు చేసిన తర్వాత కార్యాలయంలోని మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌లో పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ ఆసీనులయ్యారు. పార్టీకి సంబంధించి పలు ఫైల్స్‌పై కేసీఆర్‌ సిగ్నేచర్స్‌ చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌ 2వ తేదీన బీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. బీఆర్‌ఎస్‌ భవన్ కార్యాలయంలో వివిధ నాయకుల కార్యాలయాలు ఉండేందుకు నాలుగు అంతస్తులు ఉన్నాయి. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, జనరల్ సెక్రటరీల కోసం నాలుగు ఛాంబర్లు ఉంటాయి. మొదటి అంతస్తులో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఛాంబర్‌తో పాటు ఇతర ఛాంబర్లు ఉంటాయి. ప్రెసిడెంట్స్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్, మరో 18 రూమ్‌లతో సహా మొత్తం 20 గదులు రెండు, మూడో అంతస్తుల్లో అందుబాటులో ఉన్నాయి.

Next Story