కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి -12లో మొదటి కోటీశ్వరురాలు ఆమె..

KBC 12 winner Nazia Nasim. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి.. బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతున్న‌

By Medi Samrat  Published on  12 Nov 2020 4:56 AM GMT
కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి -12లో మొదటి కోటీశ్వరురాలు ఆమె..

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి.. బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతున్న‌ బుల్లితెర రియాలిటీ షో. ప‌ద‌కొండు సీజన్స్‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న ఈ టాలెంట్‌ షో ప్ర‌స్తుతం పన్నెండో సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సీజ‌న్‌లో తొలిసారి కోటి రూపాయ‌లు ఎవ‌రు గెలుచుకోనున్నారా అనే ఆస‌క్తి.. షో చూసే వారిలో నెల‌కొంది.

తాజాగా ఈ సీజ‌న్‌లో మొద‌టిసారి కోటి రూపాయ‌లు గెలుచుకుంది జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాంచీ నివాసి అయిన నాజియా నసీమ్. ఆమె ప్రస్తుతం ఢిల్లీలో సెటిల్ అయింది. ఆమె మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో 40 వేల రూపాయ‌లు గెలుచుకుంది. త‌ర్వాత బుధ‌వారం రోజు రూ.25 లక్షల రూపాయల ప్రశ్నకు ఒక్క లైఫ్‌లైన్ కూడా ఆమె వినియోగించుకోలేదు.

అన్ని ప్ర‌శ్న‌ల‌కు చాలా కాన్ఫిడెంట్‌గా స‌మాధానం ఇచ్చిన నాజియా.. కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌కు కూడా స‌రిగ్గా స‌మాధానం చెప్పారు. అయితే రూ.7 కోట్ల ప్రశ్న‌కు సంబంధించిన స‌మాధానంపై పూర్తి క్లారిటీ లేక‌పోవ‌డంతో.. కోటి రూపాయ‌లు తీసుకొని గేమ్ నుండి నిష్క్ర‌మించారు. కోటి రూపాయ‌ల‌తో పాటు దీపావ‌ళి గిఫ్ట్‌, చాక్లెట్ హ్యాంప‌ర్, ఆమె కొడుకుకు స్కాల‌ర్ షిప్ కూడా కేబీసీ నిర్వాహ‌కులు అంద‌జేశారు.


Next Story
Share it