టిప్పు సుల్తాన్‌ విగ్రహానికి చెప్పుల మాల వేసిన యువకుడు.. అరెస్ట్‌

కర్ణాటక రాయచూర్ జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల వేసిన కేసులో నిందితుడిని కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  2 Feb 2024 6:07 AM GMT
Karnataka, arrest, Tippu Sultan statue, Raichur District

టిప్పు సుల్తాన్‌ విగ్రహానికి చెప్పుల మాల వేసిన యువకుడు.. అరెస్ట్‌

కర్ణాటక రాయచూర్ జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల వేసిన కేసులో నిందితుడిని కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని 23 ఏళ్ల ఆకాష్ తల్వార్‌గా గుర్తించారు. అతను మాన్వి తాలూకాలోని సిరివర పట్టణంలో నివసిస్తున్నాడు. ఘటన అనంతరం నిందతుడి కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వివరించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా సేకరించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో నిందితుడు ఒకడు. పోలీసులు విచారణ చేసిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జనవరి 31న మైసూరు మాజీ పాలకుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అవమానించిన నేపథ్యంలో కర్ణాటకలోని సిరివర పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం తెల్లవారుజామున టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పుల దండలు వేయడంతో ప్రజలు తెల్లవారుజామున తెలియడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనను ఖండిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు టిప్పు సర్కిల్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డును దిగ్బంధించి నిరసన స్థలంలో టైర్లను తగులబెట్టారు. ఈ మేరకు సిరివర పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story