కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు తరచుగా జరుగుతుంటాయని, వీటిని నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర వ్యాఖ్యలు ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. షాకింగ్ వీడియోపై ప్రశ్నలకు సమాధానమిస్తూ, బెంగళూరు వంటి పెద్ద నగరంలో ఇలాంటి సంఘటనలు జరగవచ్చని ఆయన అన్నారు.
బెంగళూరులో ఓ యువతికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. భారతి లేఅవుట్‌లోని ఒక వీధిలో ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.