Karnataka minister Ramesh Jarkiholi caught in sex scandal. ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి ఒకరు తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని
By Medi Samrat Published on 3 March 2021 2:28 AM GMT
ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి ఒకరు తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఓ మహిళ ఆరోపించడం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. మంత్రి తనతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించిన ఆమె.. సంబంధిత సీడీని సహచట్టం కార్యకర్త దినేష్ కల్లాహాళ్లికి చేరవేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కోరుతూ బెంగళూరు పోలీసు కమిషన్ కమల్‌పంత్‌ను మంగళవారం సాయంత్రం దినేష్ కోరారు. కొన్ని టీవీ ఛానెళ్లకు సీడీలను పంపిన దినేష్ .. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
సంబంధిత మంత్రి టీవీ ఛానెళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని తయారు చేశారని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, అప్పుడే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే కేసును ఎదుర్కొంటాను కానీ.. వెనుకంజ వేయబోనని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి నిజంగా తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇక మంత్రిని లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రి తక్షణమే పదవికి రాజీనామా చేసి, విచారణకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రాత్రి బెంగళూరులో ధర్నాకు దిగారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో విచారణ చేపడతామని పోలీసులు చెబుతున్నారు.