హిజాబ్ వివాదంపై కమల్‌హాసన్ వ్యాఖ్యలు
Karnataka hijab row Kamal Haasan says issue creating communal divide.కర్ణాటక రాష్ట్రాన్ని హిజాబ్ వివాదం కుదిపేస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2022 11:25 AM ISTకర్ణాటక రాష్ట్రాన్ని హిజాబ్ వివాదం కుదిపేస్తోంది. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడంపై జనవరి చివరి వారంలో ప్రారంభమైన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. మంగళవారం ఉడుపి, మాండ్య తదితర జిల్లాల్లో విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ వివాదంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్ స్పందించారు. ఈ వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
''కర్ణాటకలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఈ వివాదం అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతోన్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
கர்நாடகாவில் நடப்பது கலக்கத்தைத் தூண்டுகிறது. கள்ளமில்லா மாணவர்கள் மத்தியில் மதவாத விஷச் சுவர் எழுப்பப்படுகிறது. ஒற்றைச் சுவர் தாண்டியிருக்கும் பக்கத்து மாநிலத்தில் நடப்பது தமிழ்நாட்டுக்கும் வந்துவிடக் கூடாது. முற்போக்கு சக்திகள் மேலும் கவனமாக இருக்க வேண்டிய காலம் இது.
— Kamal Haasan (@ikamalhaasan) February 9, 2022