బెంగళూరు : మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర చేసిన రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తక్షణమే ఆమోదించినట్లు రాజ్‌భవన్ శుక్రవారం తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కార్పొరేషన్ నుంచి అక్రమంగా నగదు బదిలీ చేశారన్న ఆరోపణలతో నాగేంద్ర గురువారం రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్‌కు సిఫారసు చేసినట్లు రాజ్‌భవన్ ప్రకటనలో తెలిపారు.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అక్రమ బదిలీ ద్వారా 87 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించి, దాని ఉద్యోగి చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని, తన డెత్ నోట్‌లో, అతను తనపై సీనియర్ అధికారులు, మంత్రి తీవ్రంగా ఒత్తిడి చేశారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ రెండూ వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశాయి. కార్పొరేషన్ మోసం కేసులో మంత్రి నాగేంద్ర ప్రమేయం ఉందని తేలడంతో అతనిపై చర్యలు ప్రారంభమయ్యాయి.