ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై చర్యలకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా కమిషన్ ఇచ్చిన నివేదికను కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటనకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఇచ్చింది.
జూన్ 4వ తేదీన మధ్యాహ్నం స్టేడియం దగ్గర తొక్కిసలాట చోటు చేసుకొని 11 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ఈ మొత్తం ఘటనపై ఏర్పాటైన న్యాయ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.