కుమారస్వామి మరోసారి చక్రం తిప్పబోతున్నారా..?

Karnataka Election Update. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు

By Medi Samrat  Published on  10 May 2023 9:14 PM IST
కుమారస్వామి మరోసారి చక్రం తిప్పబోతున్నారా..?

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు 107 నుంచి 119 సీట్లు రావచ్చని తేల్చింది. బీజేపీకి 78 నుంచి 90 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జేడీఎస్‌కు 23 నుంచి 29 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113 గా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మరోసారి కుమారస్వామి చక్రం తిప్పే అవకాశం ఉంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:

టీవీ9 భరత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 99-109, బీజేపీ 88-98, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4

రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ: కాంగ్రెస్ 94-108, బీజేపీ 85-100, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6

జీ న్యూస్-మ్యాట్రిజ్: కాంగ్రెస్ 103-118, బీజేపీ 79-94, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5

ఏబీపీ-సీఓటర్: బీజేపీ 66-86, కాంగ్రెస్ 81-101, జేడీఎస్ 20-27, ఇతరులు 0-3

పోల్ ఆఫ్ పోల్స్: కాంగ్రెస్ 103, బీజేపీ 94

పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 107 -119, బీజేపీ 78-90, జేడీఎస్ 23-29, ఇతరులు 1-3

సువర్ణ న్యూస్-జన్‌ కీ బాత్: కాంగ్రెస్ 91-106, బీజేపీ 94-117, జేడీఎస్ 14-24, ఇతరులు 0-2

న్యూస్ నేషన్-సీజీఎస్: కాంగ్రెస్-86, బీజేపీ-114, జేడీఎస్-21, ఇతరులు-3


Next Story