కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ్ క‌న్నుమూత‌

కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ శనివారం కన్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2023 10:19 AM IST
Congress,R Dhruvanarayan,

ఆర్ ధృవనారాయణ

కర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. లోక్‌స‌భ‌ మాజీ సభ్యుడు, కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ శనివారం కన్నుమూశారు. ఈ ఉద‌యం ఆయ‌న గుండెపోటుకు గురి అయ్యారు. వెంట‌నే ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన‌ట్లు డీఆర్ఎంఎస్ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ మంజునాథ్ తెలిపారు.

ప‌లువురు రాజకీయ నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు.

"ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా స్నేహితుడు, మా నాయకుడు, ఇక లేరు అన్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాము. ఇది తీర‌ని న‌ష్టం. మాటల్లో చెప్ప‌లేము. అణ‌గారిన వ‌ర్గాల కోసం ఎంత‌గానో పోరాడిన ఛాంఫియ‌న్." అంటూ కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.

ధృవనారాయణ మృతి పట్ల కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ ధృవనారాయణ ఆకస్మిక మరణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధృవనారాయణ అద్భుతమైన సలహాలు ఇచ్చారని శివకుమార్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

గ‌తంలో ఆయ‌న రెండుసార్లు లోక్‌స‌భ ఎంపీగా చేశారు. క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించారు. బెంగుళూరులోని అగ్రిక‌ల్చ‌ర్ వ‌ర్సిటీ నుంచి ఆయ‌న మాస్ట‌ర్స్ డిగ్రీ పొందారు. 1983లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అగ్రిక‌ల్చ‌ర్ కాలేజీలో స్టూడెంట్ లీడ‌ర్‌గా చేశారు. క‌ర్ణాట‌క‌ యూత్ కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కూడా చేశారు.

Next Story