కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొనడంతో బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానం హెలికాప్టర్ జక్కూర్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. కోలార్ సమీపంలోని ముల్బాగిలు మార్గంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోస్కోటే సమీపంలో గాలిలో ఒక డేగ హెలికాప్టర్ విండ్‌షీల్డ్‌ను బద్దలు కొట్టిందని తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదయం బెంగళూరు హోటల్‌లో పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల ర్యాలీలకు బయలుదేరారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
డీకే శివకుమమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ముందు భాగం దెబ్బతింది. ముందు అద్దం కొంత భాగం పగిలిపోయింది. అయితే పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఒక్కరికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది.