కేటీఆర్ ట్వీట్‌కు సిద్ధరామయ్య కౌంటర్..!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు లేవంటూ కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
By Medi Samrat Published on 19 Dec 2023 12:00 PM GMTఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు లేవంటూ కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనేమో అని సెటైర్ వేశారు. ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారని, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా? అంటూ ఆయన ప్రశ్నించారు. విపరీతమైన ప్రకటనలు హామీలు ఇచ్చేముందు మీకు కనీసం ఆర్థిక పరిస్థతిపై పరిశోధన ప్రణాళిక ఉండదా? అంటూ కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Dear Sri Siddaramaiah Garu,
— KTR (@KTRBRS) December 19, 2023
We’ve lost the election because your party had shamelessly misled the people of Telangana with Fake promises
Dec 9th, 2023 has passed, but where is the:
👉 Rythu Bharosa promised to farmers, tenant farmers and farm labourers
👉 Rs 2 Lakhs Farm… https://t.co/CACSR7ai28 pic.twitter.com/pZGMdikfN4
దీనిపై సిద్ధరామయ్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ షేర్ చేసిన వీడియో ఫేక్ అని సిద్దరామయ్య కొట్టిపడేశారు. 'కేటీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా?' అని ఆయన ప్రశ్నించారు. ఏది ఫేక్ వీడియోనో, ఏది ఒరిజినల్ వీడియోనో కూడా మీరు తేల్చుకోలేకపోతున్నారని అన్నారు. ఫేక్ వీడియోలను బీజేపీ సృష్టిస్తుందని.. వాటిని మీరు ప్రచారంలోకి తెస్తారని విమర్శించారు. బీజేపీకి నిజమైన బీ టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.