మహిళ ప‌ట్ల అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

Karnataka BJP MLA verbally abuses woman when she complains about rain situation in Varthur. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని వార్తూర్‌లో

By Medi Samrat
Published on : 3 Sept 2022 5:13 PM IST

మహిళ ప‌ట్ల అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని వార్తూర్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలపై ఫిర్యాదు లేఖను తనకు అందజేయడానికి ప్రయత్నించిన ఓ మహిళపై ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఒక మహిళను దుర్భాషలాడి అనుచితంగా ప్రవర్తించిన వీడియో వైరల్ గా మారింది.

గత ఆరు నెలలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం, భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాలలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ విషయాన్ని సదరు మహిళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రావాలని అనుకుంది. కానీ ఫిర్యాదు లేఖను అందజేసేందుకు ప్రయత్నించిన మహిళను లింబావలీ దుర్భాషలాడడం వీడియోలో కనిపిస్తోంది. అనంతరం మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రెండు రోజుల క్రితం, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు వర్షపు నీటి విషయంలో బెంగళూరును చాలా 'నిర్లక్ష్యం' చేశాయని ఆరోపించారు. మురికినీటి కాలువలను ప్రాపర్టీ డెవలపర్లు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురిచేస్తున్నారంటూ సీఎం అధికారులను దృష్టికి తీసుకెళ్లారు.


Next Story