మహిళ వేదిస్తోందంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు.. 'తన బిడ్డకు తండ్రిని నేనేనట'.. 'కాదని దేవుడి మీద ప్రమాణం చేయి'
Karnataka BJP MLA Rajkumar Patil allegedly blackmailed by woman.ఓ మహిళ తనను వేదిస్తోందని ఎమ్మెల్యే పోలీసులకు
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2022 8:45 AM ISTఓ మహిళ తనను వేదిస్తోందని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు పుట్టిన బిడ్డకు తానే తండ్రిని అని ఆమె ఆరోపిస్తోందని.. సంరక్షణ కోసం రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లా సేడం విధానసభ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్.. ఓ మహిళ తనను వేదిస్తోందని విధానసౌధ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
2009లో సదరు మహిళతో పరిచయం అయిందన్నారు. 2013లో ఓసారి తనను కలిసి భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. అనంతరం మరోసారి తన కుమారుడి చదువు కోసం సాయం చేయాలని అడిగినట్లు తెలిపారు. ఆ తరువాత 2018 నుంచి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టిందని ఎమ్మెల్యే ఆరోపించారు. తనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని, డబ్బు, నగల కోసం ఒత్తిడి తీసుకువచ్చిందన్నారు. ఇక 2021 మార్చిలో తన డిమాండ్లను పరిష్కరించాలని కోరిందని.. ఇప్పుడేమో ఏకంగా.. నా వల్ల తనకు సంతానం కలిగినట్లు నిందమోపిందని.. బిడ్డ సంరక్షణ కోసం రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాస్త.. ఈ ఘటన ప్రస్తుతం అక్కడ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే తనకు అన్యాయం చేశారని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళనే పోలీసులు వేదిస్తున్నారని ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపించింది. సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం బొమ్మైకి తన కష్టాన్ని చెప్పుకొని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమెను హౌస్ అరెస్టు చేయడం దారుణమని ఆమ్ఆద్మీ మహిళా విభాగం అధ్యక్షురాలు కుశల స్వామి అన్నారు.
నా బిడ్డకు తండ్రి కాదని దేవుడి మీద ప్రమాణం చేయి..
సోమవారం విలేకరుల సమావేశంలో సదరు మహిళ మాట్లాడుతూ.. సేడంలోని బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ తెల్కూర్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. నా బిడ్డకు అతడు తండ్రి కాదని దేవునిపై ప్రమాణం చేసి తిరస్కరించాలని బీజేపీ ఎమ్మెల్యేను సవాలు చేసింది.
'మేము ఒకే స్థలం నుండి వచ్చాము. అతను నా కొడుకుకు తండ్రి అని అంగీకరించాడు, దాని గురించి ఎటువంటి వివాదం లేదు. ఇప్పుడు నా కుమారుడికి న్యాయం చేయాలని అడుగుతున్నాను. అతను నా ముందుకు రానివ్వండి. నేను అతనితో దాని గురించి మాట్లాడతాను. నేను డబ్బు అడగడం లేదు. నా కొడుక్కి హక్కులు ఇవ్వనివ్వండి అని చెప్పింది.
"నేను న్యాయం చేయమని అడిగిన తర్వాత.. దాదాపు ఎనిమిది మంది పోలీసులు ఆదివారం నా ఫ్లాట్‌కి వచ్చి నన్ను విధానసౌధ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారు నన్ను స్టేషన్‌లో ఉంచారు మరియు సాయంత్రం వరకు నాతో అసభ్యంగా ప్రవర్తించారు "అని ఆమె చెప్పింది.