ప‌రీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించండి.. నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

నీట్‌కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది.

By Medi Samrat  Published on  25 July 2024 8:37 AM GMT
ప‌రీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించండి.. నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

నీట్‌కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. నీట్ పరీక్షా విధానం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద పిల్లలకు వైద్య విద్య అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్‌కు చెందిన సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతిపాదనలో పేర్కొంది. ఇది పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వైద్య కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే హక్కును కూడా హరిస్తుంది. కావున ఈ వ్యవస్థను రద్దు చేయాలని కోరింది.

నీట్ పరీక్ష నుండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని తక్షణమే మినహాయించాలని.. నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్ష (సిఇటి) మార్కుల ఆధారంగా విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని కర్ణాటక శాసన మండలి ఏకగ్రీవంగా కోరుతున్నట్లు తీర్మానంలో పేర్కొంది. నీట్ పరీక్షల్లో పునరావృతమయ్యే అవకతవకలను దృష్టిలో ఉంచుకుని..జాతీయ స్థాయిలో NEET విధానాన్ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ వైద్య కమిషన్ చట్టం, 2019 (కేంద్ర చట్టం 30, 2019)లో అవసరమైన సవరణలు కూడా చేయాలని కోరింది.

Next Story