కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న‌ బీజేపీ

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

By Medi Samrat  Published on  25 March 2024 8:46 PM IST
కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న‌ బీజేపీ

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మండి స్థానం నుంచి కంగనా రనౌత్ పేరును ప్రకటించిన తర్వాత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాధ్ అభ్యంతరకర పోస్ట్ చేసి రచ్చ సృష్టించారు. దీనిపై బీజేపీ నేతలు సుప్రియ శ్రీనాధ్‌పై మండిప‌డుతున్నారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనాధ్‌ ఆ పోస్ట్‌ను తొలగించారు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా చిత్రాన్ని పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాశారు.. మార్కెట్లో ధర ఎంత ఉందో ఎవరైనా చెప్పగలరా.? అని రాశారు. అయితే వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆ పోస్ట్‌ను తొలగించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం స్క్రీన్‌షాట్‌లు తీసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కంగనా రనౌత్ కూడా తగిన సమాధానం ఇచ్చింది.

నటి కంగనా రనౌత్ స్పందిస్తూ.. డియర్ సుప్రియ, ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళల పాత్ర‌ల‌ను పోషించాను. క్వీన్‌లోని అమాయక అమ్మాయి నుండి ఢాకాడ్‌లోని మనోహరమైన డిటెక్టివ్ వరకు, మణికర్ణికలోని దేవత నుండి చంద్రముఖిలోని రాక్షసుడు వరకు, రజ్జోలోని వేశ్య నుండి తలైవిలో విప్లవ నాయకురాలి వరకు. మన ఆడపిల్లలను పక్షపాతపు సంకెళ్ల నుండి విడిపించాలి. ప్రతి స్త్రీ గౌరవానికి అర్హురాల‌ని బ‌దులిచ్చింది.

Next Story