Video : ఖాళీ ఇంటికి లక్ష రూపాయల క‌రెంట్‌ బిల్లు వచ్చింది : కంగనా రనౌత్‌

నటనతో పాటు ఎంపీ కంగనా రనౌత్ ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్త‌ల్లో నిలుస్తుంటారు.

By Medi Samrat
Published on : 9 April 2025 2:34 PM IST

Video : ఖాళీ ఇంటికి లక్ష రూపాయల క‌రెంట్‌ బిల్లు వచ్చింది : కంగనా రనౌత్‌

నటనతో పాటు ఎంపీ కంగనా రనౌత్ ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ప్రజల ముందు తన భావాలను బహిరంగంగా చెప్పడానికి ఆమె ఏమాత్రం వెనుకాడదు. కంగనా రనౌత్ ఈసారి తన ఒక నెల కరెంటు బిల్లు లక్ష రూపాయలు వచ్చిందని చెప్పింది. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ నివాసి.. కానీ ఆమె వ్య‌క్తిగ‌త‌, సినీ, రాజ‌కీయ‌ పనుల‌ కారణంగా తన ముంబై ఇంటిలో ఎక్కువ సమయం గడుపుతుంది. తాజాగా బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ మండిలో జరిగిన ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన మనాలి ఇంట్లో కరెంటు బిల్లుకు సంబంధించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కంగనా రనౌత్ యొక్క ఈ వైరల్ వీడియోను రాహుల్ చౌహాన్ అనే వ్యక్తి తన అధికారిక X ఖాతాలో పంచుకున్నారు. ఈ నెలలో నేను ఇక్క‌డ లేక‌పోయినా మనాలిలో నా ఇంటికి రూ. 1 లక్ష బిల్లు వచ్చింది. బిల్లు చూసి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.. మనందరికీ అవకాశం ఉంది.. నా సోదర సోదరీమణులారా.. మీరందరూ ఈ నేలపై చాలా కష్టపడే వ్యక్తులు.. ఈ దేశాన్ని ముఖ్యంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత మనందరిపై ఉంది. ఒక విధంగా తోడేళ్ళ బారి నుండి రాష్ట్రాన్ని విడిపించాలి అని పిలుపునిచ్చారు.


Next Story