ప్రధానిపై విరుచుకుపడిన కంగనా
Kangana Ranaut slammed Canadian Prime Minister. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
By M.S.R Published on 1 Feb 2022 6:40 AM GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వ్యాక్సిన్లు, మాస్క్ లు, లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్న కెనడియన్ ట్రక్ డైవర్ల నిరసనలపై కంగనా తన వాయిస్ ను వినిపించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఈ విషయంపై నటి కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ రాశారు. కంగనా ఈ పోస్టులలో కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోపై విరుచుకుపడింది. 2020 సంవత్సరంలో.. భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు ట్రూడో మద్దతునిచ్చాడనే విషయాన్ని గుర్తు చేసింది. "కెనడా ప్రధాని ట్రూడో భారతీయ నిరసనకారులను ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు తన దేశంలో రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు.. ఎందుకంటే నిరసనకారులు వారి భద్రతకు ముప్పుగా ఉన్నారు. ఎవరి కర్మకు వారే బాధ్యులు" అని తెలిపింది.
2020లో, జస్టిన్ ట్రూడో భారతదేశంలో రైతుల నిరసనకు తన మద్దతును అందించాడు, "'రైతుల నిరసన గురించి భారతదేశం నుండి వస్తున్న వార్తలపై నేను మాట్లాడాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబం, స్నేహితుల కోసం ఆందోళన చెందుతున్నాము. మీలో చాలా మందికి ఇది వాస్తవమని మాకు తెలుసు. శాంతియుత నిరసనకారుల హక్కులను కాపాడేందుకు కెనడా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మేము అనేక మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించాము. మనమందరం ఒక్కతాటిపైకి రావాల్సిన తరుణమిది'' అంటూ చెప్పుకొచ్చాడు. ట్రూడో ప్రభుత్వం ట్రక్ డ్రైవర్లకు టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. దీంతో డ్రైవర్లు నిరసనలు ప్రారంభించారు. నిరసనకారులు ఈ నిబంధనలను ఫాసిజంతో పోల్చారు.