క్షమాపణలు చెప్పను.. కర్ణాటకలో సినిమాను విడుదల చేయట్లేదు

కమల్ హాసన్ "కన్నడ భాష "తమిళం నుండి పుట్టింది" అనే తన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టులో తెలిపారు.

By Medi Samrat
Published on : 3 Jun 2025 6:30 PM IST

క్షమాపణలు చెప్పను.. కర్ణాటకలో సినిమాను విడుదల చేయట్లేదు

కమల్ హాసన్ "కన్నడ భాష "తమిళం నుండి పుట్టింది" అనే తన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టులో తెలిపారు. తన 'థగ్ లైఫ్' చిత్రాన్ని ప్రస్తుతం కర్ణాటకలో విడుదల చేయకూడదని కూడా కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. కమల్ హాసన్ కన్నడ పట్ల అత్యంత గౌరవం కలిగి ఉన్నారని, ఇంకేమీ చెప్పనవసరం లేదని నటుడి న్యాయవాది కోర్టులో అన్నారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. సినిమా విడుదల చేయడం లేదు కాబట్టి ప్రస్తుతానికి సినిమా విడుదలకు భద్రత అవసరం లేదు, తాము ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు జరుపుతామని కమల్ హాసన్ న్యాయవాది తెలిపారు. ఈ పిటీషన్ జూన్ 10న మళ్ళీ విచారణకు రానుంది.

కర్ణాటక హైకోర్టు నటుడు కమల్ హాసన్‌ను తీవ్రంగా విమర్శించింది. థగ్ లైఫ్‌ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయాలని, ఇబ్బందులు లేకుండా ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించారు. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ ప్రకటనకు క్షమాపణ చెప్పడానికి హాసన్ నిరాకరించడాన్ని జస్టిస్ ఎం నాగప్రసన్న ప్రశ్నించారు. ఏ పౌరుడికీ మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని న్యాయమూర్తి అన్నారు. నీరు, భూమి, భాష పౌరులకు ముఖ్యమైనవని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేం ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం, మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పాలని కోర్టు సూచించింది.

Next Story