ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశాను.. చర్చను నిపుణులకు వదిలేద్దాం : కమల్ హాసన్

కన్నడ భాషపై వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదం రేపిన కమల్ హాసన్ ఒక వివరణ ఇచ్చారు.

By Medi Samrat
Published on : 28 May 2025 7:52 PM IST

ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశాను.. చర్చను నిపుణులకు వదిలేద్దాం : కమల్ హాసన్

కన్నడ భాషపై వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదం రేపిన కమల్ హాసన్ ఒక వివరణ ఇచ్చారు. "నేను చెప్పినది ప్రేమతో చెప్పాను. చాలా మంది చరిత్రకారులు నాకు భాషా చరిత్రను నేర్పించారు. అది నా ఉద్దేశ్యం ఏమీ కాదు. తమిళనాడు అనేది ఒక మీనన్ మన ముఖ్యమంత్రిగా, ఒక రెడ్డి మన ముఖ్యమంత్రిగా, ఒక తమిళుడు ముఖ్యమంత్రిగా, ఒక కన్నడిగ అయ్యంగార్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం." అని అన్నారు.

భాషా మూలాల గురించి రాజకీయ నాయకులు నిగ్రహం పాటించాలని, అలాంటి విషయాలను నిపుణులకే వదిలేయాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. "రాజకీయ నాయకులు భాష గురించి మాట్లాడటానికి అర్హులు కారు. నాతో సహా వారికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ లోతైన చర్చలన్నింటినీ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలివేద్దాం" అని ఆయన అన్నారు.

కమల్ హాసన్ "కన్నడ తమిళం నుండి పుట్టింది" అనే వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కర్ణాటకలో కన్నడ అనుకూల సంఘాలు కమల్ హాసన్ సినిమా "థగ్ లైఫ్" పోస్టర్లను తగలబెట్టడంతో పాటూ సినిమా విడుదల చేయనివ్వద్దని కోరారు.

Next Story