కోరుకున్న చోటికి వెళ్లొచ్చు.. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ రియాక్ష‌న్‌..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ మంత్రి పదవికి, ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

By Kalasani Durgapraveen  Published on  18 Nov 2024 2:20 PM IST
కోరుకున్న చోటికి వెళ్లొచ్చు.. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ రియాక్ష‌న్‌..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ మంత్రి పదవికి, ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ స‌మ‌క్షంలో సోమవారం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి బైజయంత్ పాండా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తదితర నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

కైలాష్ గెహ్లాట్ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. స‌డెన్‌గా రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చారు. కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. "వారు కోరుకున్న చోటికి వెళ్ళడానికి వారికి స్వేచ్ఛ ఉంది" అని అన్నారు. మనీష్ సిసోడియా స్పందిస్తూ.. తనతో వారు గౌరవప్రదంగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేయాలన్నా, ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది.. అది ఆయన కోరిక అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు పెద్ద నేతలు బీజేపీలో చేరతారని ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా గతంలో ప్రకటించారు. కైలాష్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడడంతో.. ఆప్ పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో యమునా, శీష్‌మహల్‌ల దయనీయ స్థితి గురించి ప్రస్తావించారు. అయితే ఆప్ మాత్రం ఈడీ దాడుల‌ను త‌ప్పించుకునేందుకే ఆయ‌న బీజేపీ గూటికి చేరార‌ని కామెంట్ చేసింది.

Next Story